Lingampet | ఆస్తి కోసం కన్న తండ్రినే కడతేర్చాడు

Crime | ఆస్తి కోసం కన్న తండ్రినే కడతేర్చాడు
Crime | ఆస్తి కోసం కన్న తండ్రినే కడతేర్చాడు
Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Crime | ఆస్తికోసం మద్యం మత్తులో కన్న తండ్రినే కడతేర్చిన ఘటన లింగంపేట మండలం శెట్పల్లిలో జరిగింది. సీఐ రవీందర్ నాయక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ తండ్రి పేరిట ఉన్న ఆస్తిని తన పేరిట చేయాలని వల్లకాటి లింగంతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో గత నెల 18న లింగంను కొడుకు చంద్రశేఖర్ కొట్టగా, తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని బుధవారం అరెస్ట్​ చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్సై వెంకట్రావు, ఏఎస్సై ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement