Court | హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు

Court | హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు
Court | హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: Court : హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద గ్రామానికి చెందిన కర్రె రామకృష్ణయ్యకు అదే వర్గానికి చెందిన కర్రె రాజయ్యకు కొన్నేళ్లుగా భో వివాదం ఉంది. ఈ విషయమై అక్టోబరు 17, 2020న కులపెద్దల సమక్షంలో మాట్లాడటానికి కొడుకు ప్రవీణ్ తో కలిసి పంచాయితీకి వెళ్లారు. పంచాయితీలో మాట్లాడుతుండగానే ఆగ్రహానికి గురైన కర్రె రాజయ్య.. కర్రతో రామకృష్ణయ్య తల, నడుముపై కొట్టడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే రామకృష్ణయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే రాజయ్య నేరం చేసినట్టుగా పోలీసులు కోర్టులో రుజువు చేయడంతో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Kamareddy | జడ్జిని కలిసిన ఎస్పీ రాజేష్​ చంద్ర