అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కామారెడ్డి జిల్లా జడ్జి District Judge సీహెచ్ వరప్రసాద్ Vara Prasad తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ రాజేష్‌చంద్ర SP Rajesh Chandra తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు.
మద్నూర్ Madnoor మండలం కుర్ల గ్రామానికి చెందిన తూకమణి అలియాస్ పంచశీలను 2019 ఆగస్ట్ 12న అదే గ్రామానికి చెందిన తలారి అలియాస్ భాగెలివార్ సంతోష్ హత్య చేశాడు. సంతోష్ తూకమణితో చనువుగా ఉండేవాడు. అయితే ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని సంతోష్ తూకమణిని హత్య చేశాడు. ఈ కేసులో సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.4వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.