అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: వ్యాపారులు తమ దుకాణాల్లో చోరీ జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి సూచించారు. గురువారం నగరంలోని వస్త్రభవన్‌లో వ్యాపారస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వస్త్రవ్యాపారులు తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. దుకాణాల్లో హైసెక్యూరిటీ లాకర్లు ఏర్పాటు చేసుకోవాలని.. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేయాలని సూచించారు. షాప్‌లలో అలారమ్ సిస్టం తప్పనిసరిగా ఉండాలని, ఇన్సూరెన్స్ చేయించుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దుకాణాల్లో చోరీలు జరుగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి
Advertisement
Advertisement