అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ఫేక్ యాప్ ద్వారా నగరంలో అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన షేక్ ఆమెర్, సయ్యద్ ఇమ్రాన్ ఇద్దరూ కలిసి టెలిగ్రామ్‌లో ఉన్న ఎంజీఐ యాప్ ద్వారా మార్కెటింగ్ ప్రారంభించారు. ఈ యాప్‌లో చేరితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి సుమారు 12 మంది వద్ద నుంచి రూ.2.40 లక్షలను వసూలు చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో 5వ టౌన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం ఇరువురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.
ఫేక్ యాప్‌తో మోసగిస్తున్న ఇద్దరి అరెస్ట్
Advertisement
Advertisement