అక్షరటుడే, నిజాంసాగర్: PRIVATE SCHOOL | మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు నాయకులు మంగళవారం ఎంఈవో తిరుమల రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శ్రీసాయి హైస్కూల్‌ను రేకుల షెడ్లో నడుపుతున్నారని, ఫైర్‌సేఫ్టీ కూడా లేకుండా కొనసాగిస్తున్నారని వివరించారు. ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయిన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నారని ఆరోపించారు.
అడ్డగోలుగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. పాఠశాలలో కనీస వసతులు లేవని.. తక్షణమే ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్ తదితరులున్నారు.