అక్షరటుడే, ఇందూరు: NIZAMABAD CITY | అనుమతి లేకుండా ప్రవేశాలు చేపడుతున్న ప్రెసిడెన్సీ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. బుధవారం డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఛాంబర్లో బైఠాయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేకున్నా.. కనీసం భవన నిర్మాణం పూర్తి కాకున్నా 50శాతం ప్రవేశాలు చేపట్టారని ఆరోపించారు. ఈ విషయమై విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టాలని కోరారు.
జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా డీఈవో స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాన్ని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, ప్రధాన కార్యదర్శి రఘురాం తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.