అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | నంబర్‌ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేష్‌చంద్ర(Sp Kamareddy Rajesh Chandra) అన్నారు. గురువారం పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా, నర్సన్నపల్లి వద్ద వాహనాల తనిఖీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ర్యాష్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయమై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపవద్దని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు.
Kamareddy | నంబర్ ప్లేట్ లేకుంటే చర్యలు: ఎస్పీ రాజేష్‌చంద్ర
Advertisement
Advertisement