అక్షరటుడే, బోధన్: District Hospital | వైద్యులు, సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని డీసీహెచ్ శ్రీనివాస్(DCH Srinivas) హెచ్చరించారు. పట్టణంలోని జిల్లా ఆస్పత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆస్పత్రిలో వీల్చైర్లు(Wheelchairs), స్టెచర్లు(Stretchers) అందుబాటులో లేకపోవడం.. ప్రతిఒక్క కేసును నిజామాబాద్ జీజీహెచ్(GGH)కు రిఫర్ చేయడం వంటి అంశాలపై ఆరా తీశారు. సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రాహుల్, వైద్యులు, రహీం, స్రవంతి తదితరులున్నారు.