అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ(SP) రాజేశ్ చంద్ర హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో పోలీస్(Police) అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయా ఎస్‌హెచ్‌ఓల పరిధిలో సమస్యలపై ఆరా తీశారు. ప్రతి గ్రామ సమాచారం తెలుసుకునేలా గ్రామానికో పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. బ్యాంకులు(Banks), ఏటీఎంలు(ATMs), పెట్రోల్ బంక్, ప్రార్థనా స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ తిరుపయ్య, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.