అక్షరటుడే, వెబ్ డెస్క్: పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన తమ ప్రేక్షకురాలు రేవతి కుటుంబానికి అండగా ఉంటామని నటుడు అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ ఘటన వల్ల చిత్రం యూనిట్ మొత్తం షాక్కు గురైనట్లు పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని అన్నారు. భవిష్యత్తులో ఆమె పిల్లలకు ఏమి అవసరం వచ్చినా తాము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి అల్లు అర్జున్ వీడియో విడుదల చేశారు.