అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్‌ స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ కార్యవర్గ సమావేశంలో జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అధికారంలోకి వచ్చేందుకు అబద్ధపు హామీలు ఇచ్చారని సీఎం స్టాలిన్‌ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో కులగణన నిర్వహించకపోవడంపై కేంద్రం, డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేశారు.