అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తనకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని నటుడు మంచు మనోజ్‌ పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. “పది మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి గొడవ చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాడి చేశారు.” అని మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనలో మనోజ్‌కు గాయాలైన విషయం తెలిసిందే.