అక్షరటుడే, వెబ్‌డెస్క్: నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈనెల 24 వరకు పోలీసుల ముందు విచారణకు మోహన్‌బాబు హాజరు కావాల్సిన అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. గొడవ మోహన్ కుటంబ వ్యవహారమని కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు మోహన్‌బాబు ఇంటి వద్ద నిఘా ఉంచాలని, సీసీ కెమెరాల ద్వారా ఇంటి ఆవరణను పర్యవేక్షించాలని సూచించింది. తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది.