అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఇటీవల నిర్వహించిన బీజేపీ సభలో నటి కస్తూరి తెలుగువారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘ 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంత:పుర మహిళలకు సేవ చేయడానికి తెలుగువారు తమిళనాడుకు వచ్చారు అలా వచ్చిన వాళ్లు ఇప్పుడు తమది తమిళజాతి అంటూ పెద్దపెద్దమాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని ఎలా అంటున్నారు..? ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగుమాట్లాడేవారు ఉన్నారు. ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు. ఇతరుల భార్యలపై మోజుపడొద్దు. ఒకరికంటే ఎక్కువ మందిని భార్యలుగా చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతున్నారు. ఇలా మంచి చెబుతున్నారు కాబట్టే వారికి వ్యతిరేకంగా తమిళనాడులో ప్రచారం సాగుతోంది’ అని వ్యాఖ్యానించారు.
కస్తూరీ క్లారిటీ..
తాను తెలుగువారిని అవమానించలేదని తనవ్యాఖ్యలపై కస్తూరి క్లారిటీ ఇచ్చారు. తమిళమీడియాలో నా కామెంట్స్‌ను వక్రీకరిస్తూ వస్తోన్న వార్తలను తెలుగు ప్రజలు నమ్మొద్దని కోరుతున్నా.., డీఎంకే పార్టీ నా కామెంట్స్‌ను వక్రీకరిస్తోందని, తెలుగువారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ విషప్రచారం చేస్తోందని కస్తూరి క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.