అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న నటి కస్తూరి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. మధురై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కస్తూరి బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ కొనసాగనుంది. బహిరంగ క్షమాపణలు చెప్పినా తనపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారనేది కస్తూరి వాదన. ఈమె ఇంటికి తాళం వేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గత రెండు రోజులుగా పరారీలో ఉన్నారు. కస్తూరిపై చెన్నై, మధురై సహా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాగా తెలుగు వారంటే తన మెట్టింటివారని, వారంటే తనకెంతో గౌరవం అని ఇటీవల మీడియా ఎదుట మాట్లాడే సందర్భంలో చెప్పారు. తమిళనాడులో ఉన్న ద్రవిడియన్ వాదులు తనపై కక్ష కట్టి విష ప్రచారం చేస్తున్నారని వాపోయారు.