అక్షరటుడే, హైదరాబాద్: నటి లావణ్య మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. బిగ్‌బాస్ ఫేమ్ ఆర్‌జే శేఖర్ బాషాపై ఫిర్యాదు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు.. మస్తాన్‌సాయి, శేఖర్ బాషా ప్రయత్నించారని ఆరోపించారు. ఈ మేరకు లావణ్య ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన మస్తాన్‌సాయి, శేఖర్ బాషా ఆడియోలను పోలీసులకు లావణ్య అందజేశారు.