అక్షరటుడే, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ భారీవిరాళం ప్రకటించింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రూ.100 కోట్ల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.