అక్షరటుడే, భీమ్‌గల్‌: జిల్లా అదనపు కలెక్టర్‌ అంకిత్‌ భీమ్‌గల్‌ మండలంలోని చెంగల్‌, బడా భీమ్‌గల్‌ గ్రామాల్లో సమగ్ర సర్వే ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని సంబంధిత ఎన్యుమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి సంతోష్‌ కుమార్‌, మండల రెవెన్యూ అధికారి, సంబంధిత సూపర్‌ వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.