అక్షరటుడే, భీమ్‌గల్: భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్, చెంగల్, బడా భీమ్‌గల్, పల్లికొండ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్ మంగళవారం పరిశీలించారు. ధాన్యాన్ని ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ షబ్బీర్, ఏవో వంశీకృష్ణ, ఏఈవో భార్గవ్, ఏపీఎం రవీందర్, సెర్ఫ్ అధికారులు కుంట శ్రీనివాస్, నరేష్, రఘుపతి, నాయకులు స్వామి, రమేష్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.