అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూరు మంజీర నది ఇసుక క్వారీలను బుధవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. రాత్రి సమయంలో కొంతమంది ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీ చేసినట్లు తెలిపారు. ఇసుకను ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట తహశీల్దార్ లత, డీఎస్పీ సత్యనారాయణ తదితరులున్నారు.