అక్షరటుడే, ఎల్లారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులది ధాన్యం తూకం వేసిన తర్వాత వివరాలను ట్యాబ్ లో వేగవంతంగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ నరేందర్, సొసైటీ సీఈవో పెంటయ్య తదితరులున్నారు.