అక్షరటుడే, ఎల్లారెడ్డి : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. తూకం వేయడంలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. కాంటా వేసిన ధాన్యం వెంట వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు.