అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌కు అదనపు డీజీ మహేష్‌ భగవత్‌, ఐజీ సత్యనారాయణ చేరుకున్నారు. లగచర్ల ఘటన, అరెస్ట్‌లపై స్థానిక పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నారు. భూ అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌, అధికారులపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇప్పటికే 3 కేసులు నమోదు చేసి, 20 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డితో పాటు కీలక సూత్రధారులు సురేష్‌, విశాల్‌ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.