అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Adilabad Airport | ఆదిలాబాద్(Adilabad) విమనాశ్రయానికి లైన్ క్లియర్ అవుతోంది. ఇటీవల వాయుసేన(Air Force) అధికారులు ఎయిర్‌పోర్టుకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన ఈ ఎయిర్‌పోర్ట్‌లో పౌరవిమాన సేవలకు తాజాగా కేంద్రం అంగీకారం తెలిపింది.
ఇందుకు సంబంధించి రక్షణశాఖ నుంచి మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(Rajnath Singh) అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఎయిర్‌పోర్టు అనుమతుల కోసం కృషి చేశారు.
ఇటీవల వరంగల్ మామునూరు(Mamunoor) ఎయిర్‌పోర్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. తాజాగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు విషయంలో కూడా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే వాయుసేన, రక్షణ శాఖ ఆమోదం తెలపడంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించనుంది.