నిజాంసాగర్, అక్షరటుడే: ఆదివాసి నాయక్ పోడు సేవా సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ శరత్ ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కుల సర్టిఫికెట్స్ ఇవ్వడం విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని కమిషనర్ కు విన్నవించారు. స్పందించిన అయన.. ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి పై చదువుల నిమిత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే అర్హులైన వారందరికి పత్రాలు ఇవ్వాలని డైరెక్టర్ ను ఆదేశించినట్లు సంఘం కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు బండారి బోజన్న, గాండ్ల రామచందర్, హైకోర్టు అడ్వకేట్ పి కిషన్ తెలిపారు. కమిషనర్ ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిర్నపల్లి సాయిలు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుల మోట్ట పెంటయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు పుట్ట వెంకట్, సాంస్కృతిక కార్యదర్శి ముత్యాల సంజీవులు, ఉద్యోగ సంఘం అధ్యక్షులు తౌడగారి సాయిలు తదితరులు ఉన్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్‌ను కలిసిన ఆదివాసి నాయక్ పోడు సభ్యులు
Advertisement
Advertisement