అక్షరటుడే, కామారెడ్డి : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీలో శనివారం సొసైటీ ఛైర్మన్ సదాశివరెడ్డి అధ్యక్షతన వరి కొనుగోలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి రామ్మోహన్ పాల్గొని మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈసారి సన్న రకాలకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్న సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో సన్నం వడ్లలో దొడ్డువడ్లు కలవకుండా చూసుకోవాలన్నారు. ఏఈవో, ఏవో ధ్రువీకరించిన ధాన్యమే తూకం వేసి మిల్లుకు పంపించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మానిటరింగ్ ఆఫీసర్ సాయిలు, సూపరింటెండెంట్ ప్రశాంత్, సీఈవో బైరయ్య, వైస్ ఛైర్మన్ పశుపతి, డైరెక్టర్లు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.