అక్షరటుడే, బాన్సువాడ: kalthi kallu : కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపిన విషయం విదితమే. ఈ కేసులో నిన్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్ వివరాలు వెల్లడించారు.
బీర్కూరు మండలం దామరంచ గ్రామంలో కల్తీ కల్లు కేసులో ప్రధాన నిందితుడు గాడుదుల గంగాధర్ గౌడ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రూరల్ సీఐ రాజేష్ తెలిపారు. హాని కలిగించే అల్ప్రాజోలం మత్తు పదార్థం(alfrazolam drug) కలిపిన కల్లును దుర్కి గ్రామానికి చెందిన ఉడుతల లక్ష్మా గౌడ్, సురేందర్ గౌడ్ వద్ద నుంచి గంగాధర్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. దీనితో కల్తీ కల్లు తయారు చేసి, ప్రజలకు విక్రయించడం ద్వారా వారి అనారోగ్యానికి కారణమైన నిందితుడు గంగాధర్ గౌడ్ ను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.