అక్షరటుడే, బాన్సువాడ: పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న ఘటన బాన్సువాడలో కలకలం రేపింది. పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పశువుల కొవ్వుతో కల్తీ నూనె తయారు చేస్తున్నారు. తయారు చేసిన నూనెని మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంటి దాబాపైన కొవ్వుతో నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించిన స్థానికులు మంగళవారం వారిని నిలదీశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.