అక్షరటుడే, కామారెడ్డి: క్రాప్ బుకింగ్ యాప్ లో పంటల వివరాల నమోదు ఏఈవోల ఒక్కరితో సాధ్యం కాదని ఏఈవోల జేఏసీ ప్రతినిధులు శ్రవణ్ కుమార్, రాకేష్ అన్నారు. తమకు సహాయకులను నియమించాలని కోరారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాగరాజు, దేవరాజు, సాయిలు, సంతోష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీలక్ష్మి, మౌనిక, రజిత, సౌజన్య పాల్గొన్నారు.