అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సుమారు నెల రోజుల తర్వాత వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం వరకు ఊగిసలాడిన ఇండెక్స్‌లు.. ఆ తర్వాత లాభాల బాట పట్టాయి. చివరికి సెన్సెక్స్‌ 363 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఎస్‌బీఐ, బీఈఎల్‌, ఐచర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్టీపీసీ లాభపడగా టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, మారుతి, హీరో మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, ఎయిర్‌టెల్‌ నష్టపోయాయి.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Stock Market | సెస్సెక్స్‌ పైపైకి.. భారీ లాభాల్లో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌