అక్షరటుడే, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. మొత్తం 29 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నియోజకవర్గానికి మొత్తం 42 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. స్క్రూటినీలో పది మంది నిబంధనల ప్రకారం పత్రాలు సమర్పించకపోగా వారి నామినేషన్లను తిరస్కరించారు. మిగితా 32 మంది అభ్యర్థుల్లో ముగ్గురు స్వతంత్రులు ముత్యం రఘు, పోతు నాగార్జున్, పోతు రవి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అర్వింద్ ధర్మపురి (బీజేపీ), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్‌ఎస్), జీవన్ రెడ్డి తాటిపర్తి(కాంగ్రెస్), పుప్పాల లింబాద్రి(బీఎస్పీ), అబ్బగోని అశోక్ గౌడ్(బహుజన లెఫ్ట్ పార్టీ), అలీ మన్సూర్(అన్నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ), కండెల సుమన్(ధర్మ సమాజ్ పార్టీ), గుయ్య సాయి కృష్ణమూర్తి(యుగ తులసి పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), దేవతి శ్రీనివాస్(బహుజన ముక్తి పార్టీ), భూక్యా నందు(విద్యార్థులు రాజకీయ పార్టీ), మొగిలి రాజ్ కుమార్(ఇండియా ప్రజా బంధు పార్టీ), యోగేందర్ గట్ల(అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ), ఆరె రాజేందర్, కొత్తకొండ శక్తిప్రసాద్, కోటగిరి శ్రీనివాస్, గంట చరితా రావు, గోపి చంద్రయ్య, టుటుకూరు జీవన్ రెడ్డి, దేశబోయిన లక్ష్మీనారాయణ, బీబీ నాయక్, పాలమూరు సాయి నిఖిల్, ప్రశాంత్ కట్రాజి, మాలావత్ విఠల్, రాగి అనిల్, రాపల్లి సత్యనారాయణ, రాపెల్లి శ్రీనివాస్, వేముల విక్రమ్ రెడ్డి, సయ్యద్ అస్గర్ స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హన్మంతు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో సోమవారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హన్మంతు సమావేశమయ్యారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్ సమక్షంలో ఈసీ మార్గదర్శకాలను అనుసరించి అభ్యర్థుల పేర్లు అధికార తెలుగు భాష వర్ణమాల ప్రకారం క్రమ సంఖ్య కేటాయించారు. అనంతరం స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను అలాట్ చేశారు.