అక్షరటుడే, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక తర్వాత బంగారం ధర రోజురోజుకు తగుతూ వస్తోంది. ఇప్పటికే రూ. 4 వేలకు పైగా తగ్గింది. గత రెండు రోజుల్లోనే రూ. 2 వేలు తగ్గడం గమనార్హం. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్, బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 77,280 కు దిగివచ్చింది. 22 క్యారెట్ల ధర 10 రూ. 70, 990గా ఉంది. వెండి ధర కేజీ రూ. 99,900 పలుకుతోంది.