అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఎన్సీపీ కీలక నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య తర్వాత మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ కూడా తమ హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సోమవారం సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద భద్రతను పెంచింది. అయితే ఎన్సీపీ నేత సిద్దిఖీ కొడుకు ప్రస్తుత ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కూడా ఈ డేంజరస్ గ్యాంగ్ హిట్‌లిస్ట్ ఉన్నట్లు సమాచారం.