అక్షరటుడే, భిక్కనూరు: BHIKNOOR | దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయం పరిసర ప్రాంతంలోని వీరభద్ర స్వామి ఆలయం వద్ద అగ్ని గుండాలు ఏర్పాటు చేశారు. తదుపరి ఆలయంలో దక్షయజ్ఞం చేశారు.
BHIKNOOR | ఆలయ ప్రాశస్త్యమిది..
ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని శివుడి అరుదైన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ కొలువైన సిద్దేశ్వరస్వామి అత్యంత శక్తివంతుడిగా భక్తులు నమ్ముతారు. స్వయంభుగా వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఆలయానికి విచ్చేస్తారు. ఆలయానికి సమీపంలో నీటి బావి ఉంది. ఏడాది పొడుగునా నీరు ఉంటుంది.