అక్షరటుడే, బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు సమన్యాయం చేస్తోందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో దొడ్డి కొమురయ్య కురుమ సంఘం భవన ప్రారంభోత్సవానికి వెళ్తున్న వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బలరాజ్, కురుమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గంగారం, నర్సుగొండ, విఠల్, ఇజాజ్, సురేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.