అక్షరటుడే, బాన్సువాడ: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ పేర్కొన్నారు. గురువారం వర్ని మార్కెట్‌ కమిటీలో వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఆగ్రోస్‌ చైర్మన్‌ కాసుల బాలరాజుతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు క్వింటాల్‌కు రూ. 500 అదనపు బోనస్‌ చెల్లిస్తుందన్నారు.