అక్షరటుడే, కామారెడ్డి : బీసీలకు తగిన న్యాయం జరగాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన కులగణన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 6 నుంచి జరగబోయే కులగణన కార్యక్రమంలో కార్యకర్తలు కూడా పాల్గొనాలన్నారు. సర్వేకు వచ్చే అధికారులకు కార్యకర్తలు సహకరించాలని పేర్కొన్నారు. దేశంలో కులగణన చేపట్టే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.