అక్షరటుడే, బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డిని బుధవారం నాయకులతో కలిసి రుద్రూర్ ఏఎంసీ డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. రుద్రూర్ మండలానికి ముగ్గురు ఏఎంసీ డైరెక్టర్లను ఇచ్చినందుకు పోచారం, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రుద్రూర్ మండలాధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, ఉపాధ్యక్షుడు నగేశ్, రవికుమార్, డైరెక్టర్లు పార్వతి ప్రవీణ్, నాగయ్య, షేక్ మహబూబ్ పాల్గొన్నారు.