అక్షరటుడే, బాన్సువాడ: సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ లోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో సోమవారం ఆయన పర్యటించారు. ఇళ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ. ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాలనీలో వీధి లైట్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరడంతో సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో బషీరోద్దీన్, విద్యుత్ ఏఈ అనిల్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాజ్, శ్రీశైలం, నర్సింలు, కాశీరాం తదితరులు పాల్గొన్నారు.