అక్షరటుడే, బాన్సువాడ : క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని బోర్లం క్యాంప్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి కామారెడ్డి, సిద్దిపేట్ క్రీడాపోటీలను సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో జోనల్ అధికారిణి ప్రత్యూష, ఆర్సీవో నాగేశ్వరరావు, ప్రిన్సిపాళ్లు రమాదేవి, లక్ష్మీబాయి, తహశీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.