అక్షరటుడే, బాన్సువాడ: రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి.. మద్దతు ధర పొందాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, నార్ల సురేష్, కృష్ణారెడ్డి, ఎజాజ్, మోహన్ నాయక్, వెంకన్న గుప్తా, అంజిరెడ్డి పాల్గొన్నారు.