Govt Employee | వ్యవసాయ శాఖ ఉద్యోగి మృతి

వ్యవసాయ శాఖ ఉద్యోగి మృతి
వ్యవసాయ శాఖ ఉద్యోగి మృతి
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: Govt Employee : అనారోగ్యంతో బాధపడుతూ వ్యవసాయ శాఖ ఉద్యోగి శనివారం రాత్రి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నవీన్(37) 9 నెలల క్రితం సిద్దిపేట నుంచి కామారెడ్డికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి అతని ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేదని తోటి ఉద్యోగులు తెలిపారు. దీంతో వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ లో డిప్యుటేశన్ కోసం తిరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని సమాచారం. ఆయన మరణం ఉద్యోగులను కలచివేసింది.

Advertisement