అక్షరటుడే, ఇందూరు: తమకు కేటాయించిన దుకాణాల్లోనే కూరగాయల విక్రయాలు జరపాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి సూచించారు. గురువారం నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణాల ముందు రోడ్లపై కూరగాయల విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూరగాయల వాహనాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. గంజ్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని యూనియన్ నాయకులను కోరారు. ఆయన వెంట ఏఎంసీ డైరెక్టర్లు మల్లేశ్, నరేందర్ తదితరులున్నారు.