రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

0

అక్షరటుడే, బాన్సువాడ: రైతులకు మెరుగైన సేవలందించి ఆగ్రో ఇండస్ట్రీస్‌ను లాభాల బాటలో నడిపిద్దామని కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాల్ రాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మేనేజర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగ్రో ఇండస్ట్రీస్‌ ద్వారా అందించే సేవలను రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలన్నారు. మేనేజర్లు రైతులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ సబ్సిడీలను ఎత్తేసి రైతుల సమస్యలు, సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. రైతులకు సబ్సిడీపై అందించాల్సిన పనిముట్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లి రైతులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఆగ్రోస్‌ ఎండీ రాములు, మేనేజర్లు మధుసూదన్‌, మల్లికార్జున్‌, రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న, జిల్లాల ఆగ్రో మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.