అక్షరటుడే, బాన్సువాడ: కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేయాలని, పార్టీ గెలుపునకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దెగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గం బిలోలి తాలూకాలోని భామిని గ్రామంలో ఆదివారం ఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. దెగ్లూర్ కాంగ్రెస్ అభ్యర్థి నివర్తి రావును గెలిపించాలని కోరారు.