Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్‌ఆద్మీపార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ప్రజలకు మరో కీలక హామీని ప్రకటించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దె ఇళ్లలో నివసించే వారికి ఉచిత విద్యుత్‌, నీరు అందిస్తామని పేర్కొన్నారు. పూర్వాంచల్‌కు చెందిన అనేక మంది కౌలుదారులకు సైతం ఉచిత విద్యుత్‌ , నీటి సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement