అక్షరటుడే, వెబ్డెస్క్: AI | కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-artificial intelligence ఏఐ) ప్రాధాన్యం రోజురోజుకు పెరిగి పోతోంది. ఆధునిక ఆరోగ్య సంరక్షణలోనూ ఏఐ AI ప్రభావం విపరీతంగా పెరుగుతోంది. రుగ్మతలను గుర్తించడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలనూ solutions సూచిస్తోంది.
ఓ చిన్నారి అనారోగ్య స్థితికి కారణాలు గుర్తించడంలోనూ, వైద్యం అందించడంలోనూ 17 మంది డాక్టర్లు విఫలం కాగా.. తల్లి చాట్ జీపీటిని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఏఐ చాట్బాట్ ఆ చిన్నారికి ఉన్న అరుదైన రుగ్మతను గుర్తించడమే కాకుండా అత్యవసరంగా అందించాల్సిన వైద్య చికిత్సను urgent medical treatment సైతం సూచించింది. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంతో ఏఐ AI ప్రాధాన్యత మరోసారి చర్చనీయాంశమైంది.
AI | మూడేళ్లుగా అనారోగ్య సమస్యలు..
అమెరికాకు America చెందిన అలెక్స్ Alex కరోనా తర్వాత తీవ్ర ఇబ్బందులు serious problems పడడాన్ని అతని తల్లి కోర్ట్నీ గమనించింది. మూడేళ్లుగా నిత్యం పంటి నొప్పులు toothaches, బిడ్డ పెరుగుదల లేకపోవడం, శరీరంలో అసహజ మార్పులు చోటుచేసుకోవడాన్ని గుర్తించిన తల్లి.. అనేక మంది వైద్య నిపుణులను సంప్రదించారు. మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు Multi-specialty doctors, నరాల వైద్యులు neurologists, డెంటిస్టులు dentists, ఇతర నిపుణులు పరీక్షించినా ఆరోగ్య సమస్యలు health problems ఏమిటో కనుక్కోలేకపోయారు. 17 మంది వైద్యులను సంప్రదించినా ఎలాంటి ఫలితం దక్కలేదు. దీంతో నిరాశకు గురైన ఆమె లోలోన కుంగిపోయింది. ఈ తరుణంలో ఆమెకు ఏఐ చాట్ జీపీటి AI ChatGPT మార్గం చూపించింది. తన కుమారుడి ఎంఆర్ఐ రిపోర్ట్స్ను MRI reports, అతని రుగ్మతల లక్షణాలను నమోదు చేసింది.
AI | క్షణాల్లోనే గుర్తించిన చాట్జీపీటి
కోర్ట్నీ వివరాలు నమోదు చేసిన క్షణాల్లోనే చాట్ జీపీటీ ChatGPT.. బాలుడి రుగ్మతలకు కారణమేమిటో తేల్చి చెప్పింది. టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ (వెన్నెముక spine లోపల సమస్యలు)తో బాలుడు బాధ పడుతున్నాడని తెలిపింది. అరుదైన నాడీ సంబంధిత రుగ్మతలతో బాధ పడుతున్న బాలుడికి తక్షణమే చికిత్స చేయించాలని సూచించింది. లేకపోతే నరాలు దెబ్బతిని, పిల్లాడు పెరిగే కొద్దీ శారీరక సమస్యలు physical problems మరింత పెరుగుతాయని పేర్కొంది. దీంతో కోర్ట్నీ.. ఈ సిండ్రోమ్ గురించి మరింత ఆరా తీయడం ప్రారంభించింది. టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ తోనే బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకున్న ఫేస్ బుక్ గ్రూపులో చేరింది. ఇతరుల పిల్లలకు ఉన్న అనారోగ్య సమస్యలు health problems తన పిల్లాడిలోనూ ఉన్నాయని గుర్తించిన ఆమె.. అలెక్స్ ను న్యూరో సర్జన్ దగ్గరకు తీసుకెళ్లింది.
AI | కోలుకుంటున్న అలెక్స్..
అయితే, చాట్ జీపీటీ Chat GPT చెప్పిన టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ తో tethered cord syndrome అలెక్స్ బాధ పడుతున్నట్లు న్యూరో సర్జన్ తేల్చారు. కృత్రిమ మేధ ఇచ్చిన సమాచారం సరైనది కావడంతో కోర్ట్నీ ఆశ్చర్యానికి గురయ్యారు. వైద్యులు అలెక్స్ కు వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
AI | కొత్త చర్చకు తెరలేపిన ఏఐ
అలెక్స్ ఉదంతం తర్వాత కృత్రిమ మేధస్సు గురించి మరోమారు చర్చనీయాంశమైంది. వైద్యులు గుర్తించలేని అనారోగ్య సమస్యను గుర్తించడమే కాకుండా దానికి పరిష్కార మార్గాలను కూడా సూచించడంతో కృత్రిమ మేధస్సు ఆసక్తికర చర్చకు దారి తీసింది.