అక్షరటుడే, ఇందూరు : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను న్యూఢిల్లీలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ తన కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ, ఉద్యోగ నియామకాలు, స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాట్లు, విదేశీ పెట్టుబడులపై తీసుకున్న నిర్ణయాలను వివరించారు. నామినేటెడ్ పోస్టుల్లో సమన్యాయం పాటించామని ఈ సందర్భంగా కేసీవేణుగోపాల్‌కు పీసీసీ చీఫ్ సవివరంగా తెలియజేశారు.