అక్షరటుడే, హైదరాబాద్: ఏఐసీసీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ ను నియమించింది. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ కు బాధ్యతలు అప్పగించింది. 2009లో మధ్యప్రదేశ్లోని మాండసోర్ నుంచి మీనాక్షి నజరాజన్ ఎంపీగా కొనసాగారు. దీపాదాస్ మున్షీపై అధిష్ఠానానికి తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు వెళ్లాయి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నాయకుల మధ్య సమన్వయం కుదర్చలేకపోయారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
Advertisement
Advertisement